ఆంధ్ర ప్రదేశ్
నల్లిక్రీక్ వంతెనకు గండి

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం వేములదీవి వెస్ట్ గ్రామంలోని చినమైన వాని లంక గ్రామంలో నల్లిక్రీక్ వంతెనకు బుధవారం తెల్లవారు జామున 2 గంటలకు గండి పడింది. వంతెనకు అటువైపు ఆక్వా చెరువులుకు వెళ్లిన గ్రామస్తులు ఆరుగురు అక్కడే ఉండి పోయారు. గ్రామానికి రావడానికి అవకాశం లేకపోవడంతో అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఆర్డివో దాసిరాజు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకుని వెళ్లి గ్రామస్థులును సురక్షితంగా తీసుకొని వచ్చారు.



