ఆంధ్ర ప్రదేశ్
Gudivada Amarnath: సూపర్ 6 అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చారు

Gudivada Amarnath: నమ్మకానికి, మోసానికి మధ్య ప్రజలు వ్యత్యాసం చూశారని వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. సూపర్ సిక్స్ అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. రైతులకు ఇస్తానన్న పెట్టుబడి సాయం 20 వేలు ఏమైంది?.
పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బకాయిలు పెట్టారని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు రెండు ఎకరాల నుంచి కోట్లాది రూపాయలు ఎలా సంపాదించారని ప్రశ్నించారు.