ఆంధ్ర ప్రదేశ్
దేవుడి హుండీలో కర్పూరం వెలిగించి వేసిన భక్తురాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థాన ఆలయంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఆలయానికి వచ్చిన ఓ భక్తురాలు అత్యుత్సాహం పెను ప్రమాదానికి కారణమయ్యేది. ఆలయానికి వచ్చిన ఓ మహిళ కర్పూరాన్ని వెలిగించి హుండీలో వేసింది. దీంతో హుండీలో ఉన్న కరెన్సీ నోట్లకు నిప్పు అంటుకుని హుండీ నుంచి పొగలు వ్యాపించాయి.
వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. కాలిన నోట్లను గుర్తించి ఆలయ సిబ్బంది. సీసీ కెమెరాల ద్వారా ఈ చర్యకు పాల్పడిన భక్తురాలని గుర్తించి ఆమె వద్ద నుంచి డబ్బులు వూసులు చేయాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు.



