మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ టీచర్ల వినూత్న నిరసన

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తెల్లబండ తండాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు వినూత్న నిరసనకు దిగారు. ప్రైవేట్ స్కూల్ బస్సులు, ఆటోలను చిలుకోడు గ్రామ ఉపాధ్యా యులు అడ్డగించారు. ప్రభుత్వ పాఠశాలల విద్య గురించి ప్రైవేట్ యాజమాన్యాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థులను ప్రైవేట్ స్కూల్స్‌లో ఎలా చేర్పించుకుంటారంటూ నిలదీస్తున్నారు.
ప్రైవేట్ స్కూల్స్‌కి దీటుగా బోధన అందిస్తున్నామంటున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. స్టూడెంట్స్‌కి ప్రభుత్వం భోజనం కూడా పెడుతోందంటూ గుర్తుచేశారు. ప్రభుత్వ స్కూల్లో చదివితే బంగారు భవిష్యతు ఉంటుందని వివరించారు. అనవసరంగా ప్రైవేట్ స్కూల్స్‌కు డబ్బులు కట్టి లక్షల రూపాయలు నాశనం చేసుకుంటున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే జీతాలకు తాము న్యాయం చేస్తామంటున్నారు ఉపాధ్యాయులు.