తెలంగాణ
తెలంగాణలో మందుబాబులకు మరో గుడ్న్యూస్

Telangana: తెలంగాణలో మందుబాబులకు సర్కారు మరో గుడ్న్యూస్ చెప్పింది. లిక్కర్ బ్రాండ్ల కొత్త విధానానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. రాష్ట్రంలో రిజిస్టర్ కాని కొత్త సప్లయర్స్ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది.
దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో లేని విదేశీ, దేశీయ లిక్కర్, బీర్ కంపెనీలకు అవకాశం లభించింది. నాణ్యత, ప్రమాణాలపై తెలంగాణ ప్రభుత్వం సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకోనుంది. తెలంగాణలోకి కొత్తగా ప్రవేశించే ఆయా కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి ఆరోపణలు లేవని తెలుపుతూ దరఖాస్తుతో పాటు సెల్ఫ్ సర్టిఫికేట్ జతపరచాలని టీజీబీసీఎల్ స్పష్టం చేసింది.