ఆంధ్ర ప్రదేశ్
Gorantla Butchaiah: జగన్ వచ్చేది అధికారంలోకి కాదు.. రాజమండ్రి సెంట్రల్ జైలుకే

Gorantla Butchaiah: జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మరో మూడేళ్ల తరువాత అధికారంలోకి వస్తానని జగన్ చెబుతున్నారని కాని ఆయన వచ్చేది అధికారంలోకి కాదని రాజమండ్రి సెంట్రల్ జైలుకు అన్నారు.
జగన్ మళ్లీ జైలు ఊచలు లెక్కించాల్సిందేనన్నారు. లిక్కర్, మైనింగ్ కుంభకోణాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయన్న గోరంట్ల జగన్ హయాంలో పంటలకు ఇన్సూరెన్స్ చెల్లించకపోవడంతో రైతులు వేల కోట్ల నష్టపోయారన్నారు.