ఆంధ్ర ప్రదేశ్
ఇంజన్ నుంచి విడిపోయిన గూడ్స్ బోగీలు.. పెను ప్రమాదం తప్పింది

అనంతపురం జిల్లా రాయదుర్గం రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కి ప్రమాదం తప్పింది.ఎల్ సి నెంబర్ 35 వద్ద తెల్లవారుజామున ఇంజన్ నుండి బోగీలు విడిపోయాయి. మైసూరు వైపు నుంచి కర్నాటకలోని జిందాల్ పరిశ్రమకు మైన్స్ మట్టి లోడుతో వెళ్తున్న వ్యాగన్ రాయదుర్గం రాగానే ఒక్కసారిగా కప్లింగ్ కట్టుకవడంతో ఇంజన్ తో పాటు 6 బోగీలు మాత్రమే వెళ్లాయి.మిగతా 45 బోగీలు ఇంజిన్ నుంచి విడిపోయి సుమారు కిలోమీటర్ దూరంలో నిలిచిపోయాయి.
గమనించిన డ్రైవర్ రాయదుర్గం రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. అనంతరం రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆరు భోగి ల నుంచి ఇంజన్ వేరు చేసి అదే ఇంజన్ వెనక్కి వెళ్లి ఆ ఇంజన్ 45 భోగిలకు అటాచ్ చేసి జిందాల్ కి పంపించారు. ఆరు భోగిలను రాయదుర్గం రైల్వేస్టేషన్లో నిలిపివేశారు.



