Corruption Case: పంజాబ్ ఐపీఎస్ ఆఫీసర్ ఇళ్లల్లో సోదాలు.. రూ.5 కోట్లు లభ్యం

Corruption Case: పంజాబ్‌లో భారీ అవినీతి తిమింగలం సీబీఐకి చిక్కింది. ఓ స్క్రాప్ డీలర్‌ను బెదిరించి రూ.8 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన పంజాబ్ క్యాడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి హరచరణ్ సింగ్ భులార్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆయన నివాసంలో భారీగా నగదు, బంగారం బయటపడింది. సీబీఐ సోదాల్లో రూ.5 కోట్ల నగదు, విలాసవంతమైన కార్లు, నగలు, ఖరీదైన వాచీలు వంటి అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. ఈ కేసులో భుల్లార్‌తో పాటు మధ్యవర్తి కృష్ణను కూడా అరెస్ట్ చేశారు.
8 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన పంజాబ్ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి నివాసంలో భారీగా డబ్బు, బంగారం బయటపడింది. CBI సోదాల్లో కళ్లుచెదిరే ఆస్తులు బయటపడ్డాయి. పంజాబ్ డీఐజీ హరిచరణ్ సింగ్ భులార్‌ను అవినీతి కేసులో అరెస్ట్ చేసిన సీబీఐ అతడి నివాసంలో డబ్బు, బంగారంతో పాటు రేంజ్ రోవర్ కారును స్వాధీనం చేసుకుంది.
8 లక్షల లంచం డిమాండ్ చేసిన ఆ సీనియర్ ఐపీఎస్ అడ్డంగా బుక్కయ్యారు. ఏకంగా 5 కోట్ల నగదు, విలాసవంతమైన కార్లు, నగలు, ఖరీదైన వాచీలు వంటి భారీ అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. ఈ కేసులో భుల్లర్‌తో పాటు, మధ్యవర్తిగా వ్యవహరించిన కృష్ణ అనే ప్రైవేట్ వ్యక్తిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది.
పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన హరచరణ్ సింగ్ 2009 బ్యాచ్ అధికారి. ఒక వ్యాపారవేత్తపై నమోదైన క్రిమినల్ కేసును మాఫీ చేయడానికి మధ్యవర్తి ద్వారా లంచం తీసుకుని, నెలవారీగా మామూళ్లు డిమాండ్ చేస్తున్నట్లు సీబీఐ ఆరోపించింది.
పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్‌కు చెందిన పాత సామాన్లు డీలర్ ఆకాష్ బట్టా ఫిర్యాదు చేయడంతో గుట్టురట్టయ్యింది. తనను తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించి, 8 లక్షలు వసూలుచేసిన భులార్.. ఆ తర్వాత నెల నెల తనకు కొంత నగదు ఇవ్వాలని బెదిరించినట్టు ఆరోపించారు.



