వ్యాపారం

Gold Rate: తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‏లో తులం ఎంతంటే..!

Gold Rate: బంగారం ధర భారీగా తగ్గింది. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అనేక కారణాలు ఉన్నాయి. బంగారం ధరలు ఒక దశలో భారీగా పెరిగి ఒక లక్ష రూపాయలు సైతం చేరుకుంది. అక్కడ నుంచి తగ్గుముఖం పట్టడం ప్రారంభించాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95,730 ఉండగా. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,800 పలికింది. ఒక కేజీ వెండి ధర రూ. 1,06,000 పలికింది. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు కారణంగా చెప్పవచ్చు.

బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా డాలర్ విలువ బలపడటం ఒక కారణంగా చెప్పవచ్చు. దీనికి తోడు బంగారం ధరలు తగ్గడానికి.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటన కారణంగా స్టాక్ మార్కెట్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నాయి. చైనాతో వాణిజ్య చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటీవల డోనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. అలాగే ఇతర దేశాలతో కూడా టారిఫ్ ప్లాన్ ల పైన డోనాల్డ్ ట్రంప్ సంప్రదింపులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button