తెలంగాణ
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

Shamshabad: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. కువైట్ నుంచి షార్జా మీదుగా హైదరాబాద్ చేరుకున్న ఒక ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు తనిఖీ చేయగా, అతని వద్ద 7 బంగారు కడ్డీలు లభ్యమయ్యాయి. సుమారు 1.8 కిలోల బరువున్న ఈ బంగారు కడ్డీల విలువ సుమారు 2.37 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రయాణికుడి నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 5 బంగారు బిస్కట్లు, రెండు కట్ పీసులు ఉన్నాయి. అధికారులకు అనుమానం రాకుండా వాటిని లగేజీ డోర్ మెటాలిక్ లాక్‌లో కొంత భాగాన్ని, అలాగే పొద్దు తిరుగుడు గింజలు ఉన్న ప్లాస్టిక్ పౌచ్‌లో మరికొంత బంగారాన్ని దాచి తరలించే ప్రయత్నం చేశాడు.



