Gold: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. కుప్పకూలుతున్న బంగారం ధరలు

Gold: బంగారం కొనుగోలు చేసే వారికి ఇదే మంచి ఛాన్స్. బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు భారీ పతనం దిశగా పయనిస్తున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో పసిడి రేట్లు వరుసగా పడిపోతున్నాయి. మూడు రోజులుగా గోల్డ్ రేట్లు దిగివచ్చాయి. ఇక వెండి రేటు ఇవాళ ఒక్కరోజే ఏకంగా 8 వేల మేర పడిపోయింది.
దీపావళి పండగ తర్వాత బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. వరుస సెషన్లలో భారీగా దిగివస్తున్నాయి. మూడు రోజులుగా తగ్గుతూనే ఉన్నాయి. అంతకు ముందు భారీగా పెరుగుతూ సరికొత్త రికార్డ్ గరిష్ఠాలను చేరిన గోల్డ్ రేట్లు మళ్లీ వెనక్కి మళ్లుతున్నాయి. అమెరికా సుంకాలు, ప్రపంచ వాణిజ్య అనిశ్చితులు, డాలర్ విలువ తగ్గడం వంటి చాలా కారణాలు బంగారం రేట్లు పెరిగేందుకు ఆజ్యం పోశాయి. అలాగే దీపావళి పండగ గిరాకీ ధరలు పెరిగేందుకు కారణమైంది.
అయితే, ఇప్పుడు బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. వరుస సెషన్లలో భారీగా పతనమవుతుండడం కొనుగోలుదారులకు ఊరట కల్పిస్తోంది. డాలర్ పుంజుకుంటున్న క్రమంలో ఇన్వెస్టర్లకు బంగారంపై పెట్టుబడుల్లో ప్రాఫిట్ బుకింగ్స్‌కు దిగుతున్నారు. భారీగా విక్రయిస్తున్న క్రమంలో ధరలు పడిపోతున్నాయి.
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కుప్పకూలాయి. ఇవాళ ఒక్కరోజే స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఏకంగా 240 డాలర్లు పడిపోయింది. దీంతో ఔన్స్ గోల్డ్ ధర 4104 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. ఒక్కరోజులో ఈ స్థాయిలో ధరలు తగ్గడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఒక్కరోజే 7 శాతానికి పైగా పడిపోయ 48 డాలర్ల స్థాయికి దిగివచ్చింది.
బంగారంతో పోటీ పడుతూ పెరిగిన వెండి ధరలు తగ్గడంలోనూ అంతకు మించిన పోటీ ఇస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి రేటు ఏకంగా 8వేల మేర పడిపోయింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 1,82,000 వద్దకు దిగివచ్చింది. ఇక ముంబై, ఢిల్లీలో రూ.1,64,000 వద్ద వెండి లభిస్తోంది.



