వ్యాపారం
Gold Price: సరికొత్త రికార్డు.. రూ.లక్ష దాటిన బంగారం ధరలు

Gold Price: బులియన్ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెడుతూనే ఉంది. గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు నాన్‌స్టాప్‌గా పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో లక్ష మార్క్ దాటి దూసుకెళ్తుంది. అయితే అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం గోల్డ్, సిల్వర్ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.
ఒక్కోసారి ధరలు తగ్గితే మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి. అయితే తాజాగా బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగాయి. అక్షయ తృతీయ కూడా ఉండటంతో మరింత పుంజుకుంది బంగారం. రిటైల్ మార్కెట్ లో తొలిసారి పసిడి ధర లక్ష దాటింది. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర లక్షా 2వేలకు పైగా పెరిగింది.