వ్యాపారం
Gold Rate: రికార్డు సృష్టిస్తున్న బంగారం, వెండి ధరలు

Gold Rate: దేశీయ మార్కెట్‌లో రోజురోజుకు బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల మేలిమి 10 గ్రాముల బంగారం ధర 1లక్షా 42వేల 150కు చేరుకుంది. అటు వెండి కూడా పరుగులు పెడుతోంది.
కేజీ ధర ఏకంగా రూ.2లక్షల 36 వేల 400 పలికింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఈ లోహాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఔన్సు బంగారం ధర 4వేల 507 డాలర్లు, వెండి ధర 72.22 డాలర్లకు చేరింది. ఈ నెల 18 నుంచి వెండి ధర దాదాపు 14.33 శాతం పెరిగింది.



