ఆంధ్ర ప్రదేశ్
కనకదుర్గమ్మకు గాజుల అలంకరణ.. పోటెత్తిన భక్తులు

కార్తీక మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. గాజుల అలంకారంలో అర్థరాత్రి 1 నుంచి అమ్మవారి దర్శనమిస్తున్నారు. 5 లక్షల గాజులతో అమ్మవారిని అలంకరించారు ఆలయ అధికారులు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు.
ఆలయ ప్రాంగాణాన్ని కూడా గాజులతో అలకరించారు. ఇక అమ్మవారి గాజుల అలంకరణ కోసం భక్తులు పెద్ద ఎత్తున గాజులు విరాళంగా సమర్పించారు. 3 రోజుల పాటు విజయవాడ కనకదుర్గమ్మ గాజుల అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కాగా ప్రతి ఏడాది ఈ గాజుల అలంకరణ చేయడం అనవాయితిగా వస్తుంది.



