తెలంగాణ
కాళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం

కాళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్ మునిగిపోయింది. నూతనంగా నిర్మిస్తున్న అపరకర్మ మండపంలోకి వరద చేరింది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి కిందికి నీటి విడుదల చేశారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 10 లక్షల 7 వేల 530 క్యూసెక్కులుగా ఉంది.



