తెలంగాణ

భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి

Bhadrachalam: భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో నీటిమట్టం 43 అడుగుల వద్దకు చేరింది . దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. వరద నీరు మరో 5 అడుగుల వరకు పెరిగి అక్కడ నుండి తగ్గుముఖం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

రామాలయం స్నాన ఘట్టాలు, కల్యాణ కట్ట వరకు నీరు రావడంతో గోదావరి నదిలోకి స్నానాలకు దిగరాదని అధికారులు సూచించారు. అటు తాలిపేరు ప్రాజెక్టు 6 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 8458 క్యూసెక్కుల వరదనీరు దిగువకు విడుదల చేశారు అధికారులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button