తెలంగాణ
అడవి దున్న దాడి.. మేకల కాపరి మృతి

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో అడవి దున్న దాడిలో మేకల కాపరి మృతి చెందాడు. కొత్తగూడ మండలం కార్లాయి గ్రామానికి చెందిన కల్తీ గోవిందును అడవి దున్న దాడి చేసి చంపినట్లు ఆలస్యంగా గుర్తించారు. ఒక అడవి దున్న చనిపోయి ఉండగా ఆ దున్నను చూస్తున్న క్రమంలో మరో అడవి దున్న గోవిందుపై దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



