తెలంగాణ
KTR: గిగ్ వర్కర్స్ కు కాంగ్రెస్ ద్రోహం చేసింది

KTR: అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి అమలుచేయకపోవడాన్ని కాంగ్రెస్ అలవాటుగా మార్చుకుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అభయహస్తం డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిసిన తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ బృందం సభ్యులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. గిగ్ వర్కర్స్ కు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. గిగ్ వర్కర్స్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.



