Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర.. ప్రత్యక్ష ప్రసారం

Khairatabad Ganesh: హైదరాబాద్ నగరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జన శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. సంప్రదాయ మేళతాళాల నడుమ, భక్తుల గోషాలతో లంబోధరుడి శోభాయాత్ర వడివడిగా ముందుకు సాగుతోంది.
గత రాత్రి 12.35 గంటలకు వెల్డింగ్ పనులు పూర్తయిన వెంటనే పూజారులు కలశాన్ని కదిలించారు. తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు మహాగణపతికి భారీ గజమాలతో అలంకరించి హారతులు సమర్పించారు. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి శోభాయాత్రను ప్రారంభించారు.
ప్రస్తుతం గణనాథుడు భక్తుల కోలాహల మధ్య ట్యాంక్ బండ్ వైపు ప్రయాణం కొనసాగిస్తున్నాడు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో గంగమ్మ ఒడికి మహాగణపతి చేరుకోనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఖైరతాబాద్ మహాగణేశుడి నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనడానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ‘గణనాథుడి జయజయధ్వానాలు’తో నగరం మారుమ్రోగుతోంది.



