ఆంధ్ర ప్రదేశ్
కృష్ణా జిల్లా బందరులో మొదటి జీబీఎస్ కేసు నమోదు

GBS Case: కృష్ణా జిల్లా బందరులో మొదటి జీబీఎస్ కేసు నమోదు అయింది. అనారోగ్య లక్షణాలతో సర్వజన ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన వ్యక్తికి జీబీఎస్ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. పరీక్షల నిర్వహించిన వైద్యులు జీబీఎస్ లక్షణాలు కన్పించడంతో చికిత్స ప్రారంభించి, వ్యాధి నిర్ధారణ కోసం నమూనాలను ల్యాబ్ కు పంపారు.
రెండు రోజుల్లో వచ్చే నివేదిక ఆధారంగా జీబీఎస్ నిర్ధారణ చేయాల్సి ఉందన్న వైద్యులు అతనికి అవసరమైన చికిత్స కొసాగిస్తున్నామన్నారు. బాధిత వ్యక్తి పెడన ప్రాంతానికి చెందిన వాడిగా చెప్పారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు వైద్యులు.