తెలంగాణ
నేడు జిల్లాల్లో గెజిట్ నోటిఫికేషన్ల జారీ

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నేడు జిల్లాల్లో గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఎన్నికల నిర్వహణపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించనుంది. హైకోర్టు తీర్పును బట్టి షెడ్యూల్, నోటిఫికేషన్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ యోచిస్తోంది. కేబినెట్ భేటీలో ఖరారు చేయనున్నారు.



