Solo Boy: మధ్యతరగతి కుర్రాడి విజయగాథ!

Solo Boy: మధ్యతరగతి జీవిత సవాళ్లను, కలల సాధనను ఆవిష్కరించే ‘సోలో బాయ్’ సినిమా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. గౌతమ్ నటన, హృదయస్పర్శి కథనం, శక్తివంతమైన సంగీతం సినిమాను మరింత ఆకట్టుకునేలా చేస్తున్నాయి. క్లైమాక్స్ గుండెల్లో నిలుస్తుంది. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోండి.
‘సోలో బాయ్’ సినిమా ఒక మధ్యతరగతి యువకుడి సంఘర్షణ, స్ఫూర్తిదాయక విజయాన్ని ఆవిష్కరిస్తుంది. కష్టాలు, అవమానాలు, ప్రేమ, విడిపోవడం, అప్పుల ఊబిలోంచి మిలియనీర్‌గా ఎదిగిన కృష్ణమూర్తి పాత్రలో గౌతమ్ అద్భుత నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి తమ సహజ నటనతో ఆకట్టుకుంటారు. అనితా చౌదరి, పోసాని తల్లిదండ్రుల పాత్రల్లో సహజత్వం పండించారు. సినిమాకు సంగీతం, బీజీఎం బలమైన అస్త్రాలు. కొన్ని డైలాగ్స్ థియేటర్లో చప్పట్లు కొట్టించాయి. కథనంలో స్వల్ప లోపాలున్నా, రైతు దళారుల సమస్యను స్పృశిస్తూ కథను నడిపిన తీరు ఆకట్టుకుంటుంది.