తెలంగాణ
ఐడీఎల్ కంపెనీలో పేలుడు .. ఒకరు అక్కడికక్కడే మృతి.. మరోకరికి గాయాలు

హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఐడీఎల్ గ్యాస్‌కట్టర్ సిలిండర్పేలింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి స్పాట్లోనే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యూపీకి చెందిన ఎండీ మోబిన్, జమీల్‌అహ్మద్ జీడిమెట్ల పరిధిలోని సుభాశ్నగర్లో నివసిస్తున్నారు. వీరు ఎర్రగడ్డలోని జీషాన్ట్రేడర్స్స్క్రాప్ కాంట్రాక్టర్ ఇంతియాజ్వద్ద లేబర్‌గా పని చేస్తున్నారు.
కూకట్‌పల్లిలోని ఐడీఎల్ కంపెనీలో ఉన్న ఐరన్ స్క్రాప్‌ను తీసుకువెళ్లడం కోసం గ్యాస్ కట్టర్‌తో కట్ చేస్తున్నారు. ప్రమాదవశాత్తు గ్యాస్‌కట్టర్ సిలిండర్పేలడంతో మోబిన్ స్పాట్లో మృతి చెందాడు. తీవ్ర గాయాలతో జమీల్ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కూకట్పల్లి పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.