బండ్లగూడలో రూ.2.31 కోట్లు పలికిన గణేశుడి లడ్డు

వినాయక చవితి పండుగ అంటే మనందరికీ చాలా ఆనందాన్నిచ్చే ఉత్సవం. ముఖ్యంగా ముంబై తర్వాత భాగ్యనగరం హైదరాబాద్ ఈ పండుగ కోసం చాలా ప్రసిద్ధి చెందింది. ప్రత్యేకంగా ఖైరతాబాద్ భారీ గణనాధుడు మరియు బాలాపూర్ గణపతి లడ్డూ వేలం మన అందరి మనసును ఆకట్టుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో గణేశుడికి మంచి పూజా ప్రాముఖ్యత ఉంది. లడ్డూ అంటే బాలాపూర్ గణేష్ లడ్డూ గుర్తుండిపోతుంది. ఇది చాలాబేళ్లుగా భక్తులలో ప్రత్యేక ఆకర్షణగా ఉంది.
ఇటీవల, గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్లోని ఇతర ప్రాంతాలలో కూడా లడ్డూ వేలంపాటలు బాగా పాపులర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్లో ఈ సంవత్సరం గణేష్ లడ్డూ వేలంపాట చరిత్రను రాసింది. రాజేంద్రనగర్ సన్ సిటీలోని కీర్తి రిచ్మండ్ విల్లాలో జరిగిన లడ్డూ వేలంలో ఒకటి ₹2.31 కోట్లు పలికింది.
ఇది గత ఏడాది నమోదైన రికార్డు ధర ₹1.87 కోట్లు ను మించి కొత్త రికార్డు స్థాపించింది.
ఈ వేలంపాట స్థానిక భక్తులు మాత్రమే కాకుండా, ఇతర ప్రాంతాల నుండి కూడా చాలా మంది వచ్చి పాల్గొంటారు. ఈ సారి వేలం రూ.1 కోటి నుంచి ప్రారంభమై భారీగా పెరిగింది.



