ఆంధ్ర ప్రదేశ్

నందిగామలో కరెన్సీ వినాయకుడు.. రూ.3కోట్ల 20 లక్షలతో ముస్తాబు

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కరెన్సీ వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఖైరతాబాద్ గణేష్ ని తలపించే విధంగా ఉన్న లంబోదరుడు అబ్బురపరుస్తున్నాడు. ఈ వినాయకున్ని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. పట్టణంలోని 43వ వార్షిక వాసవి మార్కెట్ లో ప్రతిష్టించిన గణనాథుడు విశేష పూజలందుకుంటున్నాడు.

ప్రతి ఏటా ఇక్కడ గణేష్ ఉత్సవాలు ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. 10 సంవత్సరాల క్రితం 10లక్షలతో ప్రారంభమైన కరెన్సీ వినాయకుడు ఈ ఏడాది 3కోట్ల 20 లక్షలతో ముస్తాబు చేశారు. 15వేల మందికి అన్నదానం చేస్తున్నట్లు గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button