అంతర్జాతీయం

Pakistan: పాకిస్తాన్‌లో అట్టహాసంగా వినాయక చవితి వేడుకలు

Pakistan: పాకిస్తాన్‌ మన దాయాది దేశమే అయినా ఆ పేరు వింటేనే ప్రతీ భారతీయుడి గుండెరగిలి పోతుంది. పాకిస్తాన్‌ను లేకుండా చేయాలన్నంత కోపం వస్తుంది. ఇందుకు కారణం పాకిస్తాన్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం భారత భూభాగాల ఆక్రమణకు యత్నించడం. భారత్‌లో మతకలహాలు సృష్టించి అశాంతి రగిల్చేందుకు యత్నించడమే. భారత సైన్యం చేతిలో రెండుసార్లు మూడు నాలుగుసార్లు చావుదెబ్బ తిన్నా పాకిస్తాన్‌ వక్రబుద్ధి మరాడం లేదు.

అందుకే పాకిస్తాన్‌ అంటే ప్రతీ భారతీయుడి గుండె రగిలిపోతుంది. అయితే అదే పాకిస్థాన్‌లో ఘనంగా వినాయక చవితి జరుపుకుంటారు భారీగా భక్తులు తరలివచ్చి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీన్ని చూసిన పాక్ సర్కార్ గెండెళ్లు రైళ్లు పరిగెత్తడం ఖాయం. ఇంతకీ పాకిస్తాన్‌లో వినాయక చవితి పూజలు ఎక్కడ నిర్వహిస్తారు..? ఎవరు నిర్వహిస్తారు..?

వినాయక చవితి వేడుకలను మనదేశంలో మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ ఎంతో ఘనంగా జరుపుకున్నారు. భారతదేశంలో గణేష్ చతుర్థి పండుగను ఘనంగా జరుపుకొంటున్నారు. అయితే ముస్లిం దేశంగా గుర్తింపు పొందిన పాకిస్థాన్‌లోనూ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే.

మన దాయది దేశమైన పాకిస్థాన్‌లో గణేష్ చతుర్థి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తాజాగా దాదాయాది దేశం పాకిస్తాన్‌లోని కరాచీలో గణేశోత్సవం ఎంతో ఉత్సాహంగా, భక్తితో జరుపుకున్నారు. కరాచీ నగరం మొత్తం గణపతి బప్పా మోరియా , జయ దేవ జయ దేవ అనే నినాదాలతో ప్రతిధ్వనించింది. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పాకిస్తాన్‌లోని కరాచీలో మహారాష్ట్ర సంస్థానానికి చెందిన సుమారు 1,500 కుటుంబాలు ఉన్నాయి. స్వాతంత్య్రానికి పూర్వమే 400 కుటుంబాలు కరాచీలో స్థిరపడ్డాయి. స్వాతంత్రం అనంతరం దేశ విభజన జరుగడంతో ఆ కుటుంబాలు పాకిస్తాన్‌లోకి వెళ్లిపోయాయి. నాటి 400 కుటుంబాలు ప్రస్తుతం 1,500 లకు చేరాయి. ఈ కుటుంబాలు ఏటా అక్కడ వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తాయి.

వినాయక చవితి అంటేనే మహారాష్ట్రకు పెట్టింది పేరు. పాకిస్తాన్‌లో స్థిర పడిన మహారాష్ట్రీయులు ఏటా రెండు రోజులపాటు కరాచీలో వినాయక చవితి వేడుకలు జరుపుకుంటారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచే ఈ ఆనవాయితీ వస్తోంది. మొదటి రోజు ఉదయం స్థానిక రత్నేశ్వర్‌ ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అదేరోజు రాత్రి ఆలయంలో వినాయక విగ్రహం ప్రతిష్టించి పూజలు చేస్తారు.

ఆరోజురాత్రంతా ఆలయంలోనే ఉండి పూజలు, భజనలు చేస్తారు. రాత్రంతా జాగరణ చేస్తారు. ఆటపాటలతో గడుపుతారు. సాస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. పిల్లలు ఆటపాటలతో సంతోషంగా గడుపుతారు. గణేశ్‌ చవితి అనగానే నూతన సంవత్సరం వచ్చినంత ఆనందంగా ఉంటుందని అక్కడి మహారాష్ట్రీయులు చెబుతారు.

ఇక పండుగ రెండో రోజు మహారాష్ట్రీయులంతా భక్తిశ్రద్దలతో వినాయకుడిని కొలుస్తారు. గర్భా నృత్యం చేసుకుంటూ గణపతి విగ్రహాన్ని సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం కూడా మహారాష్ట్రలో జరిగిన విధంగానే ఉత్సాహంగా నిర్వహిస్తారు. శోభాయాత్రగా వెళతారు. నృత్యాలు చేస్తారు.

గణపతి బొప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తారు. గణపతి నిమజ్జన సమయంలో కొత బాధగా ఉంటుందని, అయితే మళ్లీ చవితికి వస్తాడని ఉత్సాహంగా సాగనంపుతామని చెబుతున్నారు కరాచీలోని మహారాష్ట్ర కుటుంబాలు. కరాచీలోని హిందూ–మహారాష్ట్ర సమాజం గణపతి బప్పాకు వీడ్కోలు పలికేందుకు గణేష్‌ విసర్జన్‌ చాలా ఉత్సాహంగా నిర్వహిస్తారు.

ఈ సంవత్సరం కరాచీ డోలి ఖాటాలోని గణేష్‌ మఠం మందిర్, బోరి కాంపౌండ్‌ ఏరియా, స్వామి నారాయణ్‌ మందిర్‌, క్లిఫ్టన్‌లోని ప్రసిద్ధ శివ మందిరంలో గణేష్‌ ఉత్సవాలను ఉల్లాసంగా నిర్వహించారు. పాకిస్తాన్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులు వినాయక చవితితోపాటు జన్మాష్టమి, దీపావళి వంటి ఇతర పండుగలను కూడా జరుపుకుంటారు.

దైవభక్తి ఎక్కడైనా, ఎప్పుడైనా ఒక్కటే స్వామి భక్తి ఉన్నవారు శత్రుదేశమని చూడరు. ఉత్సవాలన్ని ఘనంగా జరుపుకుంటారు. అలాగే అన్నింటికి మూలకారణం, ఆదిదేవుడు వినాయకుడి ఉత్సవాలను కూడా ముస్లిం దేశమైన పాకిస్తాన్ లో ఘనంగా జరుపుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button