గండికోటలో వైష్ణవి హత్య కేసులో సంచలన విషయాలు

కడప జిల్లా గండికోట ఇంటర్ విద్యార్ధిని హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను చనిపోయిన స్నేహితుడి ప్రాణాలను కాపాడింది. ఇద్దరం కలిసి ప్రొద్దుటూరుకు వెళదామని లోకేష్ వైష్ణవికి చెప్పడంతో దానికి ఆమె అంగీకరించలేదు. దీంతో లోకేష్ ప్రొద్దుటూరుకు వెళ్లిపోయాడు. లోకేష్ అమ్మాయితో కలిసి ఉంటే అతన్ని కూడా చంపేందుకు నిందితులు ప్లాన్ వేశారు.
వైష్ణవి హత్య కేసులో ఆమె సోదరులను పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికై వైష్ణవిని హత్య చేసినట్లు ఆమె సోదరులు ఒప్పుకున్నారు. మరిన్ని ఆధారాల కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మొబైల్ సిగ్నల్స్‌కు సీసీ కెమెరాలకు చిక్కకుండా హంతకులు కోటలోకి ఎలా ప్రవేశించారనే అంశంపై టెక్నికల్ ఎవిడెన్స్ కోసం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. చెల్లిని హత్య చేసి బట్టలు ఎందుకు తొలగించారు అనే కోణంలో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.