ఆంధ్ర ప్రదేశ్
Gali Bhanu Prakash: చంద్రబాబును విమర్శించే అర్హత రోజాకు లేదు
Gali Bhanu Prakash: వైసీపీ మహిళా నాయకురాలు రోజాపై… తిరుపతి జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మండిపడ్డారు. ఆవుకు, గంగిరెద్దుకు ఉన్న తేడా తెలియని రోజా.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఫైరయ్యారు.. చంద్రబాబును విమర్శించే అర్హత రోజాకు లేదన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకే చంద్రబాబు దావోస్ కు వెళ్లారని.. దీనిపై విమర్శించే హక్కు రోజాకు లేదన్నారు.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చాడా అని భాను ప్రకాష్ ప్రశ్నించారు. నగరిలో తాజాగా జరిగిన చిన్నారిపై లైంగిక దాడి చేసింది వైసీపీ కార్యకర్తేనని.. అఘాయిత్యానికి పాల్పడిన వైసీపీ కార్యకర్తపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.