తెలంగాణ

స్నేహమంటే ఇదేరా.. కోతి, కుక్క అనుబంధం

Kothaguda: శత్రువులు స్నేహితులైతే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా… వానరం… శునకం… సాధారణంగా ఒకరిని ఒకరు చూస్తే చాలు… వెంటపడతాయి… కానీ అవి మాత్రం మనుషులను గుర్తు చేసేలా ఫ్రెండ్ షిప్ లా హాగ్ చేసుకుంటూ ముద్దులతో ముంచెత్తుతున్న దృశ్యం అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది..

సాధారణంగా శునకం కనిపిస్తే వానరం భయంతో పరుగులు తీయాలి.. వానరం కనబడితే శునకం వెంటపడాలి. కానీ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ అరుదైన దృశ్యం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొత్తగూడ మండల కేంద్రంలో వానరం, శునకం గంటసేపు స్నేహసముద్రంలో మునిగిపోయాయి. కలిసి కూర్చుని ఆటలు ఆడుకోవడం ముద్దులు పెట్టుకోవడం సందర్భోచితంగా కౌగిలించుకోవడం చూసిన వారందరి హృదయాలను హత్తుకున్నాయి.

ప్రజలందరినీ కదిలించిన ఈ సంఘటన ప్రకృతిలోని బంధాలు ఎంత సహజమైనవో మరోసారి రుజువు చేశాయి.. ప్రేమ, మమకారం, అనుబంధం కేవలం మనుషులకే పరిమితం కాదని, జీవరాశులన్నింటికీ సహజసిద్ధమైనవని ఈ దృశ్యం స్పష్టంగా తెలిపింది. ప్రాణమున్న ప్రతీ జీవిలో మమకారం ఒకే భాష” అని ఈ వానర–శునక స్నేహం సమాజానికి గాఢమైన సందేశాన్ని అందించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button