ఆంధ్ర ప్రదేశ్
Swarnamukhi River: స్వర్ణముఖి నదిలో నలుగురు గల్లంతు.. ఇద్దరు మృతదేహాలు లభ్యం

Swarnamukhi River: తిరుపతి వేదాంతపురం దగ్గర స్వర్ణముఖిలో గాలింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెండు మృతదేహాలు లభ్యం అయ్యాయి. నిన్న స్వర్ణముఖిలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. మిగిలిన ఇద్దరి కోసం ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు గాలిస్తున్నారు. డ్రోన్ సహాయంతో స్వర్ణముఖిని జల్లెడ పడుతున్నారు.



