తెలంగాణ
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసులు మృతి

కర్ణాటక రాష్ట్రంలోని హల్లిఖేడ్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాణగాపూర్ దత్తాత్రేయ ఆలయ దర్శనం ముగించుకుని స్వగ్రామానికి తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
వ్యాను మరియు కారు ఎదురెదురుగా ఢీకొనడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాద తీవ్రతకు నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.



