జాతియం
Alur: మాజీ ఎంపీపీ కారుకు నిప్పు పెట్టిన దుండగులు

Alur: నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ పస్కా నరసయ్య కారుకు అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. పార్కింగ్ ఏరియాలో ఉన్న కారుకు నిప్పు పెట్టడంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన స్థానికులు నరసయ్యకు సమాచారం అందించారు. మంటల ధాటికి కారు పూర్తిగా దగ్ధమైంది. నరసయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



