ఆంధ్ర ప్రదేశ్
నెల్లూరు సెంట్రల్ జైలుకు మాజీ మంత్రి జోగి రమేష్

మాజీ మంత్రి జోగి రమేష్‌ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, ఆయన సోదరుడు రాముకు విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో జోగి రమేష్‌ను నెల్లూరుకు తరలించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సెంట్రల్ జైలు దగ్గరకు చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు ధోరణి కొనసాగిస్తోందని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు మాజీ మంత్రి కాకాణి.



