తెలంగాణ
Harish Rao: కాంగ్రెస్ మొద్దు నిద్రను లేపింది బీఆర్ఎస్సే

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్ వేశారు. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో కాంగ్రెస్‌ను మొద్దు నిద్ర లేపింది బీఆర్ఎస్సే అన్నారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరుగని పోరాటం చేసింది బిఆర్ఎస్ పార్టీ అన్నారు. గోదావరిలో 1000 టిఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు చాలు అని చెప్పిన రేవంతుకు మిగులు జలాల్లోనూ తెలంగాణకు వాటా ఉంటుందని జ్ఞానోదయం చేసింది బిఆర్ఎస్ పార్టీ అన్నారు. మల్లా అవే పాత అబద్దాలు ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఇప్పటికీ ఎందుకు డిమాండ్ చేయవు? అని ప్రశ్నించారు.