జాతియం
మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు భారీ షాక్

జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు భారీ షాక్ తగిలింది. లైంగిక దాడి కేసులో ప్రజ్వల్ రేవణ్ణను కోర్టు దోషిగా నిర్ధారించింది. ప్రజ్వల్ శిక్షను కోర్టు రేపు ఖరారు చేయనుంది. తీర్పుతో కోర్టు హాల్‌లోనే రేవణ్ణ కుప్పకూలిపోయాడు.
రేప్ కేసులో మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్‌ను కోర్టు దోషిగా తేల్చింది. కర్ణాటకలోని హసన్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రజ్వల్ ప్రాతినిధ్యం వహించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజ్వల్ ఓటమి చెందారు. ప్రజ్వల్ పై రేప్ కేసుతో గౌడ ఫ్యామిలీ అబాసుపాలైంది.