తెలంగాణ
Hyderabad: ఎట్టకేలకు చిక్కిన చిరుత

Hyderabad: హైదరాబాద్‌లో శివారు గండిపేట, మొయినాబాద్, షేక్‌పేట మండలాల్లో స్థానికులకు నిద్రలేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. దాదాపు 22 రోజులుగా చిరుత సురక్షిత ప్రాంతాలను ఎంచుకొనే క్రమంలో సంచరిస్తూ అటవీ అధికారులకు సవాల్ విసిరింది.
అధికారులు ఫారెస్ట్ టెక్ పార్కులో బోనులతోపాటు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చివరికి మంచిరేవుల ఫారెస్ట్ టెక్ పార్క్‌లో ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. అటవీశాఖ అధికారులు చిరుతను జూపార్క్‌కు తరలించనున్నారు.