ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని బీసీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని బీసీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. బీసీ బాలికల హాస్టల్‌లో టిఫిన్‌లో జెర్రీ ప్రత్యక్షమైంది. అస్వస్థతకు గురైన విద్యార్ధులను ఆస్పత్రికి తరలించారు.
విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధులను ఎమ్మెల్యే వెంకట సుధీర్‌రెడ్డి పరామర్శించారు. బీసీ హాస్టల్ వార్డెన్‌ను ఎమ్మెల్యే వెంకట సుధీర్‌రెడ్డి సస్పెండ్ చేశారు.