ఆంధ్ర ప్రదేశ్
అన్నవరం వేద పాఠశాలలో ఫుడ్ పాయిజన్

కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. 8 మంది ఆగమ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురుయ్యారు. విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో వీరిని దేవస్థానం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి అక్కడినుంచి మెరుగైన వైద్యంకోసం తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. 8మంది విద్యార్థు లను ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని డీఎంహెచ్‌వో తెలిపారు.