సినిమా
Janu Lyri: గలీజ్‌గా మాట్లాడుతున్నారు.. చచ్చిపోవాలనిపిస్తోంది.. వీడియో వైరల్

Janu Lyri: డాన్సర్ జాను ఎమోషనల్ వీడియో. తన వ్యక్తిగత జీవితం గురించి.. రెండో పెళ్లి గురించి మీడియా కథనాలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై విసిగిపోయిన ఢీ డాన్సర్ జాను సూసైడ్ చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేసింది. జానపద నృత్యకారిణి జాను లిరీ తన సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన వీడియో సంచలనం రేపుతున్నది.
తనను మానసికంగా వేధిస్తున్న వారిని ఉద్దేశించి ఆవేదన కూడిన బాధను ఆమె ప్రపంచానికి చెప్పుకొనే ప్రయత్నం చేసింది. భోరున ఏడుస్తూ తన ప్రాణాలను తీస్తే తనను అవమానిస్తే.. వేధిస్తే మీకు ఏం వస్తుంది? అంటూ ప్రశ్నించింది.