జాతియం
పహల్గాం ఉగ్రదాడి.. చెన్నై నుంచి కొలంబో వెళ్లిన విమానంలో అనుమానితులు

కొలంబో ఎయిర్‌పోర్టులో శ్రీలంక పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పహల్గామ్‌లో ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు శ్రీలంకకు చేరుకున్నట్లు భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. చెన్నై నుంచి ఆ దేశంలోని బండారనాయకే అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు వెళ్లిన ఓ ప్లైట్‌లో ఆరుగురు అనుమానితులు ఉన్నట్లు భారత నిఘా వర్గాలు శ్రీలంక అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఎయిర్‌పోర్టును శ్రీలంక పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. శ్రీలంకలోని మిగతా ఎయిర్‌పోర్టులోనూ తనిఖీలు ముమ్మరం చేశారు.