తెలంగాణ

Hyderabad: కేఫ్ బేకర్స్‌లో పేలిన సిలిండర్.. ఐదుగురికి తీవ్ర గాయాలు

Hyderabad: హైదరాబాద్ అమీర్‌పేట్‌లో భారీ పేలుడు సంభవించింది. సత్యం థియేటర్‌ దగ్గర క్రిసెంట్ కేఫ్ అండ్ బేకర్స్‌లో సిలిండర్ భారీ శబ్ధంతో పేలింది. పేలుడు ధాటికి షాప్‌లోని సామాగ్రి ఎగిరి బయటపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాద సమయంలో కేఫ్‌లో కస్టమర్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button