సినిమా
నేడు గద్దర్ పురస్కారాల ప్రదానం

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా సనీ సంబరాలు జరగబోతున్నాయి. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో సినీ అవార్డులను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ హైటెక్స్ వేదికగా జరిగే వేడుకల్లో విజేతలకు వాటిని అందించి సత్కరించనున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు.
ఈ అవార్డుల ప్రదానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానుండగా, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.