సినిమా

కపిల్ రెస్టారెంట్‌పై మళ్లీ దాడి!

Kapil Sharma: స్టార్ కమెడియన్ కపిల్ శర్మ రెస్టారెంట్‌పై మరోసారి దాడి జరిగింది. కెనడాలోని ఆయన రెస్టారెంట్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసింది. నాలుగోసారి కాల్పులతో సంచలనం సృష్టమైంది. కెనడా ప్రభుత్వం సీరియస్‌గా స్పందిస్తోంది. ఈ ఘటన వెనుక కథ చూద్దాం.

కెనడాలోని కపిల్ శర్మ రెస్టారెంట్‌పై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వరుసగా దాడులు చేస్తోంది. నాలుగు నెలల్లో నాలుగోసారి కాల్పులు జరపడం బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. ఈ గ్యాంగ్ సోషల్ మీడియా ద్వారా దాడులను ప్రకటించింది. కపిల్ శర్మ వ్యాపారాన్ని దెబ్బతీసే లక్ష్యంతో ఈ దాడులు జరుగుతున్నాయని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి.

గతంలో సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేసిన ఈ గ్యాంగ్, ఇప్పుడు కపిల్ శర్మను లక్ష్యంగా చేసుకుంది. ఇండియాలో కపిల్ హై సెక్యూరిటీలో ఉన్నప్పటికీ, కెనడాలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. కెనడా ప్రభుత్వం ఈ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించి, కఠిన చర్యలకు సిద్ధమైంది. అయినా, దాడులు ఆగడం లేదు. గతంలో బాలీవుడ్ స్టార్స్‌కు బెదిరింపు మెయిల్స్ పంపిన ఈ గ్యాంగ్ ఇప్పుడు రెస్టారెంట్‌పై దృష్టి సారించింది. కెనడా పోలీసులు దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button