తెలంగాణ
Medchal: కారు కింద పేలిన టపాసులు.. దగ్ధమైన కారు

Medchal: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ పరిధిలోని కాలనీలో కారు దగ్ధమైంది. దీపావళి పండుగ సంబరాల్లో భాగంగా టపాసులు కాలుస్తుండగా ఇంటి ముందు పార్క్ చేసిన కారు కిందకి వెళ్లి టపాసులు పేలడంతో కారు కింది భాగం నుంచి మంటలు చెలరేగాయి.
క్షణాల్లోనే కారు మొత్తం దగ్ధమైంది. కారుకు మంటలు అంటుకోవడంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో కాలనీ వాసులంతా ఊపిరి పీల్చుకున్నారు.



