ఆంధ్ర ప్రదేశ్
ప్రైవేటు బస్సులో మంటలు.. తప్పిన ప్రాణనష్టం

తిరుపతి జిల్లా పెన్నేపల్లి జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది. ప్రైవేట్ బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో 22 మంది ప్రయాణికులు సురక్షితం బయటపడ్డారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసింది. ప్రమాదం బస్సు పూర్తిగా దగ్ధమైంది.



