తెలంగాణ
ఇంటి బయట పార్క్ చేసిన కారులో మంటలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్‌తో కారు అగ్నికి ఆహుతి అయింది.ప్రభుత్వ టీచర్ నాగరాజు తన టాటా పంచ్ కారులో బయట నుండి ఇంటికి వచ్చి పార్క్ చేసిన వెంటనే కారులో పొగలు వచ్చి మొత్తం మంటలు వ్యాపించాయి. మంటల దాటికి కార్ ఆద్దాలు, టైర్లు పెద్ద శబ్దాలతో పేలిపోయాయి.ఫైర్ ఇంజిన్ వచ్చేందుకు సరైన దారి లేకపోవడంతో కారు మంటల్లో కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి కారు కాలిపోయి ఉండవచ్చని స్థానికులు అంటున్నారు.



