తెలంగాణ
మెహదీపట్నంలో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు

మెహదీపట్నంలో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు స్టార్ట్ కాకపోవడంతో డ్రైవర్ రిపేర్ చేస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు పూర్తిగా దగ్ధమైంది.



