తెలంగాణ
Fire Accident: జూబ్లీహిల్స్‌లోని షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళగౌరి షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి.
అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న సిబ్బంది సేఫ్ గా బయటకు తీసుకువచ్చారు. ఘటన స్థలాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పరిశీలించారు. ప్రమాదంలో ఎవరికి ఏం కాలేదని ఆయన తెలిపారు.



