నేరం

రిటైర్డ్ డీఎస్పీ ఇంట్లో అగ్ని ప్రమాదం.. ఊపిరాడక నిద్రలోనే ఆరుగురి మృతి, నలుగురికి గాయాలు!

Fire Accident in Kathuva: జమ్మ కశ్మీర్‌లోని కథువాలో అర్ధరాత్రి ఘోరం జరిగింది. రిటైర్డ్ డీఎస్పీ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే అసలే చలికాలం కావడంతో అంతా దుప్పట్లు కప్పుకుని గాఢ నిద్రలో ఉన్నారు. అదే వారి పాలిట యమపాశంగా మారింది. అగ్ని ప్రమాదం విషయం తెలియక అక్కడే పడుకొని ఉండగా.. ఇల్లంతా పొగతో నిండిపోయింది. దీంతో ఊపిరాడక మొత్తం ఆరుగురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

జమ్ము కశ్మీర్‌లోని కథువాలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు(డీఎస్పీ)గా విధులు నిర్వహించిన.. ఓ ఆఫీసర్ పదవీ విరమణ పొందాక కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే ఆయనకు సొంత ఇల్లు లేకపోవడంతో.. మరో ఇంటిని అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇంట్లో మొత్తం 10 మంది వరకూ ఉంటారు. రోజూలాగే పనులు చేసుకున్న కుటుంబ సభ్యులు అంతా… రాత్రి త్వరగానే తినేసి పడుకున్నారు. అసలే చలికాలం కావడం.. అందులోనూ ఆ ప్రాంతంలో మరింత చలి ఉండడంతో త్వరగా దుప్పటి ముసుగేశారు.

ఊపిరాడకే ఆరుగురు మృతి..!

అంతా వారంతా గాఢ నిద్రలో ఉండగా.. అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవించింది. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. కానీ నిద్రలో ఉన్న కుటుంబ సభ్యులకు ఆ విషయం తెలియలేదు. అలాగే పడుకుని ఉన్నారు. అదే వారి ప్రాణాలు పోవడానికి కారణం అయింది. ఏమాత్రం మెలుకువ వచ్చినా వారంతా ప్రమాదం నుంచి బయట పడేవాళ్లు. కానీ నిద్రలో ఉండేసరికి ఇల్లంతా పొగ వ్యాపించింది. దీంతో ఊపిరాడక ఇంట్లోని ఆరుగురు అక్కడికక్కడే నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. మిగతా నలుగురు గాయాలపాలయ్యారు.

మరో నలుగురు ఏమయ్యారంటే?

అంతకంతకూ మంటలు ఎక్కువ అవడంతో.. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇంట్లో గాయపడిన వారిని క్షేమంగా బయటకు తీసుకు వచ్చి వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నలుగురు క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే 2 అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేసింది.


అనంతరం ఇంట్లోకి వెళ్లి ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. డీఎస్పీ ఇంట్లో అర్ధరాత్రి సంభవించిన ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్‌యే కారణం అయి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పూర్తి విచారణ తర్వాతే అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయని చెబుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button