ఆంధ్ర ప్రదేశ్
కడప జిల్లా పులివెందులలో అగ్ని ప్రమాదం

Fire Accident: కడప జిల్లా పులివెందుల పట్టణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. చవ్వా సుధాకర్ రెడ్డి కాలనీకి ఎదురుగా ఉన్న సోఫా సీట్ వర్క్ షాపులో మంటలు చెలరేగాయి. ఫర్నీచర్ షాపుతో పాటు పక్కానే ఉన్న ఎరువుల గోదాంకు కూడా మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఫర్నీచర్‌తో పాటు ఇతర సామాగ్రి, ఎరువుల గోదాం అగ్నికి ఆహుతి అయింది. మొత్తం 20 లక్షలకు పైగా నష్టం జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



